నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఇక్కడ చెబితే ఎప్పటికీ గుర్తుంటాయి
నీకు
గుర్తుందా
నాడు
నీ
ప్రక్కన
కూర్చుండి
ముద్దిమ్మని
నేను
ప్రేమతో
అడిగినపుడు
నవ్వుతూ
నగుమోము
తిప్పి
నను
నెట్టినావు
నేడు
ఎదురెదురుగ
కూర్చుండగ
ఆర్తితో
ముద్దిచ్చుటకు
నీవు
సిద్థపడినను
కూడా
ముందు
అడుగు
సాహసం
చేయలేకపోయిన
పరిస్థితి
కనుకనే
ప్రేమతో
నేనే
నీకు
పెట్టాను
తొలిముద్దు
ప్రేయసీ నా హృదయ నివాసీ
గుర్తుందా
నాడు
నీ
ప్రక్కన
కూర్చుండి
ముద్దిమ్మని
నేను
ప్రేమతో
అడిగినపుడు
నవ్వుతూ
నగుమోము
తిప్పి
నను
నెట్టినావు
నేడు
ఎదురెదురుగ
కూర్చుండగ
ఆర్తితో
ముద్దిచ్చుటకు
నీవు
సిద్థపడినను
కూడా
ముందు
అడుగు
సాహసం
చేయలేకపోయిన
పరిస్థితి
కనుకనే
ప్రేమతో
నేనే
నీకు
పెట్టాను
తొలిముద్దు
ప్రేయసీ నా హృదయ నివాసీ
: జ్ఞాపకం : ఓ రొట్టె ముక్క చిక్కక పోతే అసలు దాని గురించి ఆలోచించము. అదే ఆ రొట్టె ముక్క చిక్కిన తర్వాత పోగొట్టుకుంటే చాలా బాధ కలుగుతుంది. ఆ రొట్టె ముక్క చిక్కకున్నా బాగుండేది అని అనిపిస్తుంది. ఏదైనా అంతే ; దక్కిన తర్వాత పోగొట్టుకోవడం కంటే అసలు దక్కక పోవడమే ఎంతో మేలు.
పోగొట్టుకున్నది రొట్టె ముక్క కాకుండా వజ్రం అయితే ............ జీవితాంతం గుర్తుండి పోవలసిందే.
ఏమిటి అర్థం ?
పిల్లిని చూసి ఒక ఎలుక నవ్వుతూ ఉందంటే, దానికి దగ్గరలో తప్పించుకోవడానికి ఏదో రంధ్రం ఉన్నట్లుగా భావించాలి. లోకం పోకడ చట్టాలు ఉన్నా, శిక్షలు ఉన్నా, కోర్టులు ఉన్నా, నిబంధనలు ఉన్నా, ...... ఏవి ఉన్నా కొంత మంది నవ్వుతూనే, ఏమీ తెలియనట్లే తప్పులు చేస్తుంటారు. దొరికినకాడికి దోచుకుంటుంటారు. ఎందుకంటే తప్పు చేసినా తప్పుకు తిరగడానికి వాళ్ళ మార్గాలు వారికి ఉంటాయి కనుక. కాకుంటే మరి ఏమిటి ? తెలుగులో ఉందాం తెలివిగా ఉందాం |
చింత మాను!
చంద్రుడు కనబడలేదని ఏడిస్తే మెరిసే చుక్కలు కూడా కనబడవు ఓ సామెత ఏడిస్తే వచ్చే కన్నీటితో చూపు అస్పష్టం అవుతుంది కదా అంటే ఒకటి జరగలేదని బాధపడుతూ కూర్చుంటే ఆ బాధ వల్ల లేదా ఏకాగ్రత లేకపోవడం వల్ల మిగిలిన పనులు ఆశలు కోరికలు లక్ష్యాలు ఆగిపోతాయి కనుక ఎప్పుడూ చింతించకు గతించిన విషయాలకు బాధపడకు ఆలోచించు ప్రశాంతంగా నిద్రపో సాధనలు స్పష్టమవుతాయి తెలుగులో ఉందాం తెలివిగా ఉందాం |
ప్రయత్నం
మనకు బాగా తెలిసిన కథ చిన్నప్పుడు అమ్మ లేదా నాన్న లేదా ఉపాథ్యాయులు లేదా మిత్రులు ఎవరో ఒకరు తప్పక చెప్పి ఉంటారు కుందేలు తాబేలు పరుగు పందెం పెట్టుకున్నాయట. కుందేలు కు బదులు తాబేలు గెలించిందట. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఆలోచింపజేసే కథ. ఆ కథ గుర్తొచ్చినపుడల్లా అనిపిస్తుంది, తాబేలు తాను పరిగెత్తలేనని తెలిసినా ఓడి పోతానని తెలిసి కూడా పందెమునకు ఎందుకు సిద్థమయింది. ????????? అదే ప్రయత్నం. గెలవాలనే తపన ఉండాలి. గెలవకపోయినా ఫరవాలేదు. గెలుస్తామనే ధీమా ఉండాలి. అందుకు ఎంతో ధైర్యం సాహసం ఉండాలి. అవి తాబేలులో స్పష్టమవుతాయి. ఫలితాన్ని ఆశించవచ్చు. కానీ నెరవేరకపోతే నిరాశ చెందకూడదు. మరలా ప్రయత్నం చేయాలి. మన పిల్లలు రకరకాల పరీక్షలకు పోటీలకు సిద్థమవుతుంటారు. కొందరు వారిని నువ్వేం గెలుస్తావులే నీకెక్కడ వస్తుందిలే అబ్బో చాలా మంది ఉన్నారు బో రాశావులే అంటూ నిరాశకు గురిచేస్తుంటారు. అలా ఎన్నటికీ చేయకండి. మీరు అతని గెలుపుకూ ఓటమికి కారణం కాలేరు. కానీ నిరాశపరచటం వల్ల వారి ధైర్యాన్ని దెబ్బతీసినవారవుతారు. పెద్దలకు కూడా ప్రయత్నం ముఖ్యం ఫలితం కాదు. ప్రయత్నం ఆగిపోతే ప్రయాణం ఆగినట్టే... గమ్యం సంగతి తరువాత కనుక ఎప్పుడూ చింతించకు గతించిన విషయాలకు బాధపడకు ఫలితం అనుకూలమైనా ప్రతికూలమైనా ప్రయత్నం విడనాడకు. గెలుపు ఓ రోజు తప్పక సొంతమవుతుంది. ఆలోచించు గమ్యం గోచరిస్తుంది తెలుగులో ఉందాం తెలివిగా ఉందాం |
మనసు మట్టి భవనపు శిథిలాల లోపల మరపురాని మథుర స్మృతుల పొత్తముల పుటలు విదిలించి నెమరు వేసుకుంటున్న జ్ఞాపకాలు కళ్ళ ముందు సజీవములై గోచరించినవి నీ పిలుపుతో చిరకాలానికి పొత్తముల చక్కబరచి శిథిలాలను సంస్కరించి భవనానికి రంగులద్ది మనసు దాటిన మాటలు కళ్ళలోన దాచుకుని పయనమైనాను దర్శనానికి ప్రేయసీ నా హృదయ నివాసీ |
సమాధి
కాకుండ కాపాడుకున్న జ్ఞాపకాల అస్థి పంజరాన్ని నీ తీయని నవ్వుతో ప్రాణం పోసి కదిలించావు మేల్కొన్న కళేబరపు మనసు నిన్ను చేరలేని బాధను సైతం సంతోషంగ భావించగ గతించిన కాలపు వెక్కిరింతలు వేలెత్తి చూపగ కాలం సమీపించు వరకు ఎదురు చూడడం తప్ప చేయగలిగింది ఏమున్నది ప్రేయసీ నా హృదయ నివాసీ |
అప్పుడు
నా నవ్వు నాదే ఇప్పుడు నా నవ్వు నాది కాదు ఈ నవ్వు ఇప్పటిది కాదు అప్పుడు నువ్వు ఇచ్చిన నవ్వు ఇప్పటికీ నీదే నువ్వు దూరం అయినా నన్ను దూరం కాలేదు నవ్వు ఇపుడు నా నవ్వు నన్ను చేరింది నువ్వు దూరం అయ్యావు ప్రేయసీ నా హృదయ నివాసీ |
వెనక్కి
వెళ్ళే అవకాశం ఉంటే కాలానికీ వెళ్ళాలి అనిపిస్తే ఒక్కోసారి అనిపిస్తుంది ఎంత బాగుంటుందో వెనువెంటనే వస్తుంది అదే నవ్వు జరగదని జరిగే వీలు లేదనీ మనసు అవుతుంది మౌనంగా మాటలు అవుతాయి భారంగా ప్రేయసీ నా హృదయ నివాసీ |
కొని పెట్టుకుని
వ్రాయకుండ వ్రాయలేక దాచుకున్న ఖాళీ ఉత్తరాలను అడుగు నీకు వ్రాస్తున్నపుడు ఎంత ఆనందంగ ఎంత ఆసక్తిగ ఎంత అనుభూతి ఉండేదో వ్రాత పదాలు ఎంత పొందిక ఉండేదో ఎప్పుడైతే దూరం అయ్యావో నువ్వు దూరం అయ్యాయి పదాలు పద్ధతులు తేలాయి వ్రాతలు నీటి మీద జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి ఘనంగా ఎవరికీ చెప్పుకునే వీలు లేకుండా ప్రేయసీ నా హృదయ నివాసీ |
ఆపలేని ఆనందం
దాచలేని ఆనందం చెప్పలేనంత ఆనందం ఉంటాయని తెలుసు పొందానని తెలుసు చెప్పుకోలేని ఆనందం పంచుకోలేని ఆనందం ఆపుకోవలసిన ఆనందం కలిగింది నీ వల్లే పంచుకునే దుఃఖం పెంచుకునే దుఃఖం పట్టరాని దుఃఖం ఉంటాయని తెలుసు పొందానని తెలుసు ఆపుకోవలసిన దుఃఖం దాచుకోవలసిన దుఃఖం ఆనందించగల దుఃఖం కలిగింది నీ వల్లే ప్రేయసీ నా హృదయ నివాసీ |
అందరికీ
గదులు ఉన్నాయి నా మనసులో నేను మాత్రం కూర్చున్నాను ఒంటరినై వరండాలో నీ రాకకు తపిస్తూ ప్రేయసీ నా హృదయ నివాసీ |
లోపలి
నవ్వు నవ్వు లాగ లేదు నువ్వు లేకుండా అందుకేగ నవ్వు ఉంది బయట నువ్వు లేక లోపల లేకుండా ప్రేయసీ నా హృదయ నివాసీ |
మట్టి
బొమ్మ కాదు మనసు కొమ్మ తను వి రిగిందని తెలీదు ఎవరికీ తెలిసిన నాకు తెలుసు అతికించుట కల్లని ఏం చేయను ప్రేయసీ నా హృదయ నివాసీ |
నువ్వు
మాట్లాడుతున్న ఆనందంలో గమనించలేదు మళ్ళీ ఏడ్చే రోజు ఒకటి వస్తుందని ప్రేయసీ నా హృదయ నివాసీ |
నీ
కళ్ళ కాంతి నా చూపును త్రిప్పుకోనివ్వకుండ చేస్తుంది నీ పెదవుల తడి నన్ను మరిచేలా చేస్తుంది తడి ఆరిన నా గుండె చేనుకు తేనె జల్లువు కదా నీవు ప్రేయసీ నా హృదయ నివాసీ |
నా మది
నిండిన నీ నవ్వు నువ్వు లేవు నా దగ్గర ఎప్పటికైనా పలకరిస్తావని పలవరిస్తూ కలవరిస్తూ ఉంటానని తెలుసును కదా లేవలేని నిద్రకు రోజులు లెక్కబెడుతూ ప్రేయసీ నా హృదయ నివాసీ |
చిరుగాలిని
పలుకరించకు చిన్నబుచ్చుకుంటుంది తనకీ పడదు నీవంటే నీ చిరునవ్వు బాగుంటుందని గులాబీని పలుకరించకు గుచ్ఛుతుంది ముల్లుతో తనకీ అసూయ నీవంటే తన కంటే అందంగ ఉంటావని చెట్టు కొమ్మని అసలు పలుకరించకు పలుకక తను ఆలోచిస్తుంటుంది నీ ప్రేమ వంటి నీడను ఎలా అందించాలని నన్ను చూసి పలుకరించకు పెదవులతో మాటలాడను మాటరాదు నోటికీ నీ అందాన్ని ఎలా పొగడాలో తెలీదు నేను కంట బడితే కళ్ళతో పలుకరించు మనసుతో మాట్లాడతాను ప్రేయసీ నా హృదయ నివాసీ |
ఆగితే
మనసు మనసు కాదు మిత్తి ఆగక మనిషి మనిషి కాదు మనసు అది వస్తే ఆగదు అది వచ్చేదాక మనసు ఆగదు ప్రేయసీ నా హృదయ నివాసీ |
ఏమిటి
మంత్ర భాష్యం ఒక్క సారైనా నిన్ను గట్టిగ అదిమి పొదివి పట్టుకోలేదు గాఢంగ గుండెలకు హత్తుకోలేదు నీ పెదవులపై ముద్దైనా పెట్ట లేదు కనీసం నిన్ను ప్రేమిస్తున్నానని కూడ చెప్పనైన లేకపోతిని అయినా సరే నా గుట్టు పట్టేశావు నీ గుట్టు కూడ చెప్పేశావు ఎలా ప్రేయసీ నా హృదయ నివాసీ |
కన్ను
మూస్తే ఆలోచన కన్ను తెరిస్తే ఆలోచన రెప్ప పాటులో భావోద్వేగం ప్రేయసీ నా హృదయ నివాసీ |
ఎందుకు?
ఏమిటి? ఎలా? ఎందుకు? నువ్వు సంతోషంగ ఉంటే నాకు కేరింతగ ఉంటుంది ఏమిటిది? నువ్వు బాధ పడుతుంటే నా గుండె బరువవుతుంది ఎలా? నీలో భావాలకు నాలో స్పందన ప్రేయసీ నా హృదయ నివాసీ |
దూరమైన
ప్రాణాన్ని చూసి గాయపడిన నా గుండెకు నీ మాటలనే మందు వేసి మాయ చేశావు ఒక్క క్షణం నీ మాట లేక ఎంత వెలితి నా హృదయంలో నీకై పరితపించే గాయపడిన గుండెను మరలా మౌనంతో గుచ్ఛకే ప్రేయసీ నా హృదయ నివాసీ |
నీలో
ఒక రాగం పలికించింది నాలో సరాగం కురిపించింది లోలో అనురాగం అపుడే అనిపించింది ప్రేమించాలని నిన్ను ప్రేమించాలని కానీ ప్రేమించడం ఒక యాగమని ప్రేమించబడడం ఒక యోగమని తెలిసీ నా మనసు నీకు తెలుపక నీకు నచ్చిన నా చేష్టలతో నీచే ప్రేమించబడాలని చిత్రాలు చేశాను విచిత్రం కదా నువ్వూ అలాగే ప్రవర్తించడం నీ మనసు నాకు నా మనసు నీకు తెలుసునులే ప్రేయసీ నా హృదయ నివాసీ |
యుగాలు
క్షణాలవుతాయని అంటారు నిజమో యేమో తెలీదు కానీ నువ్వు ప్రక్కనుంటే గంటలు నిముషాలు అవుతున్నాయి తెలిసింది క్షణమొక యుగమని అంటుంటారు నిజమో యేమో తెలీదు గానీ నువ్వు లేకుంటే క్షణ క్షణం నిముషాలు అవుతున్నాయి తెలుస్తుంది భరించలేకున్నాను ఇదేనా ప్రేమంటే ప్రేయసీ నా హృదయ నివాసీ |
నీ
వలపు వానలో తడవాలనుకున్నా ఎలా నీవు వలపు కురిపించనిదే నీ నవ్వుల నావలో విహరిద్దామనుకున్నా ఎలా నీవు నవ్వనిదే నీ కన్నుల కాంతిలో పయనిద్దామనుకున్నా ఎలా నీవు చూడనిదే నీ ప్రేమ నీడలో విశ్రమిద్దామనుకున్నా ఎలా నీవు ప్రేమ చూపనిదే ఎందుకిలా మౌనంగా ఉన్నావు నీవు మనసు లేని దానవు నీ హృదయం ఒక శిల కాదు కాదు కాదు నిన్ను చూసిన నాలో స్పందన కలిగింది కదా నీ కోసం అనుక్షణం వీక్షిస్తూ నీ ప్రేమకు ప్రతీ క్షణం నిరీక్షిస్తూ వేచి ఉంటాను నా ప్రేయసీ నా హృదయ నివాసీ |
నీ
గుండె చెబుతోంది వినలేదా ప్రేయసీ నా మాటల సవ్వడి నీ మోము చెబుతోంది కనలేదా ప్రేయసీ నా అడుగుల అలికిడి నా మోము చెబుతుంది వినలేదా ప్రేయసీ నీ నవ్వుల అలజడి నా కళ్ళు చెబుతున్నాయి కనలేదా ప్రేయసీ నాలో నీ ఆశల ఉరవడి అందుకేనేమో నా పెదవి అంటోంది నీ గుండె చప్పుడు ప్రేమించానని నిన్ను ప్రేమించానని ప్రేయసీ నా హృదయ నివాసీ |
నీ
పెదవులలో నిక్షిప్తం కాని మధువులకేం తెలుసు మధురిమల గురించి నీ నవ్వులలో విరియని పువ్వులకేం తెలుసు పున్నమి వెన్నెల గురించి నీ తనువును స్పృశించని చిరుగాలులకేం తెలుసు సుగంధ పరిమళాల గురించి నీ కన్నులలో దాగని కాంతులకేం తెలుసు ప్రభాత కిరణాల గురించి నీ మాటలలో గొంతు కలపని కోయిలకేం తెలుసు సంగీతం గురించి నీ అడుగులలో అడుగు కలపని నెమలికేం తెలుసు నాట్యం గురించి ఎన్ని హంగులు ఎన్ని రంగులు ఎన్ని పొంగులు ఎన్ని కాంతులు ఎన్ని లయలు ఎన్ని కళలు అన్నీ నీ లోనే నా ప్రేయసీ నా హృదయ నివాసీ |
కాలం
నదిలో ప్రవాహంలా జ్ఞాపకాలు తాకుతున్నాయి ప్రవాహానికి ఎదురెళ్ళే సాహసం చేయలేదు మనసు నీదైనా నాదైనా మనసు కదా సుడిగుండాలు మున్ముందు ఉండవచ్చు ఆనందాలు ఆవల ఉండవచ్చు ప్రవాహం నెట్టేస్తుందో దిశ మార్చి గట్టేస్తుందో ఏమో తెలీదు నీకైనా తెలుసు నా ప్రేయసీ నా హృదయ నివాసీ |
పొద్దు పొద్దున్నే
ప్రభాత కిరణాలు వెచ్చగా నా తనువును స్పృశించినట్లు నీ జ్ఞాపకాలు నా మదిని పొద్దు వారకుండా స్పృశిస్తున్నాయి వేకువలో చలిగింతలు కలిగించే పొగ మంచులా మధ్యాహ్నానికీ మాయమవకుండా నిత్యం నా మదిలో ఉండిపోయేది నువ్వే ప్రేయసీ నా హృదయ నివాసీ |
తను
అంటుంది కదా నేను వచ్చి చాలా రోజులు అయింది గుర్తులేదా నేను నిన్ను తాకుతూనే ఉన్నాను స్పర్శలేదా నీవు చూస్తావని రెపరెపలాడుతూ ఉన్నాను కనబడలేదా నీతోనే ఉన్నాను పట్టించుకోకుండ ఉంటున్నావు ఎంత నిర్లక్ష్యం నేను వచ్చానని తెలిసీ నేను కూడా ఉన్నానని తెలిసీ కూడా ఎవరినో తలచుకుని ప్రేమ కవితలు వ్రాస్తున్నావు సిగ్గుగా లేదూ ఇపుడు నీకు అవసరమా ప్రేమ ప్రేమ అంటుంటే మాటరాక మిన్నకుండిపోయాను తరువాత మనసు అంటుంది కదా తన మాటలు పట్టించుకోకు ప్రేమ కంటే గొప్పదేం కాదు తను అతిగా ప్రవర్తిస్తే గీకేస్తే రాలిపోతుంది పీకేస్తే ఊడిపోతుంది ఊదేస్తే ఎగిరిపోతుంది అవసరమైతే అడ్డంగా నరికేయ్ పీడ విరగడౌతుంది అంతేగానీ నిన్న గాక మొన్న వచ్చింది తను నీకే సలహాలిస్తుందా నిన్నే విమర్శిస్తుందా ఎంత ధైర్యం తనకి తను కేవలం నీ మీసం మీద మొలిచిన మొట్ట మొదటి శ్వేత కేశం అనగానే కుదుట పడ్డాను మరలా నీ ఆలోచనల్లో నిద్రపోయానూ ప్రేమ మనసుది కానీ వయసుది కాదు కదా ప్రేయసీ నా హృదయ నివాసీ |
నీకు
గుర్తుందా నాడు నీ ప్రక్కన కూర్చుండి ముద్దిమ్మని నేను ప్రేమతో అడిగినపుడు నవ్వుతూ నగుమోము తిప్పి నను నెట్టినావు నేడు ఎదురెదురుగ కూర్చుండగ ఆర్తితో ముద్దిచ్చుటకు నీవు సిద్థపడినను కూడా ముందు అడుగు సాహసం చేయలేకపోయిన పరిస్థితి కనుకనే ప్రేమతో నేనే నీకు పెట్టాను తొలిముద్దు ప్రేయసీ నా హృదయ నివాసీ |
తను
రాదన్నానని తనువస్తే ప్రశాంతంగ ఉండలేనని తనతో ఉండాలంటే నాకు ఇష్టం లేదని తను రాకుండా ఉంటే మంచిదని నేను అనుకుంటున్నానని తెలిస్తే ఇంకేమన్నా ఉందా నా తోడు లేక విరహంతో రగిలిపోయే తను తన తోడు లేక ఆనందంతో నేను ఉన్నానని తెలిస్తే ఇక భరించలేక బయటకు వచ్చేస్తే ఇంత కాలం భద్రంగా కాపాడుకుంటు వస్తున్న నా ప్రశాంతత దీక్ష భంగమైపోదూ ఆ కోపం ప్రేమకు నేను బలైపోనూ అందుకే తన నుండి కాపాడబడే ఆయుధం తయారు చేసుకుని సిద్ధమైనాను అదే నీ నవ్వు అందులో కోపాన్ని తేలకుండా ముంచేస్తాను నేను మునగకుండా తేలిపోతాను ప్రేయసీ నా హృదయ నివాసీ |
ఏమిటిది?
పండు వెన్నెలలో నిద్రపోదామని మేడ పైన పడుకున్నా చంద్రుని తెల్లని వెన్నెల కాంతి వెచ్చదనాన్ని కలిగిస్తుందనుకున్నా అబ్బే అదేమంత వెచ్చగా అనిపించలేదు వెంటనే నీ తలపుల దుప్పటిలో ముసుగుతన్ని వెచ్చగా ఒదిగి పడుకున్నాక ఎప్పుడు పట్టిందో నిదుర నాకే తెలీదు ఉదయాన సూర్యుని నులి వెచ్చని కిరణాలు నన్ను తాకిన జ్ఞాపకం కూడా లేనంత వెచ్చగా ఉంది నీ జతలో బారెడు పొద్దెక్కితే గానీ తెలియలేదు నేను కలగన్నానని నా కల కలగానే మిగిలిపోయిందని నీ ప్రేమలో అన్నీ మైమరపులే ప్రేయసీ నా హృదయ నివాసీ |
అవును
అనలేకపోతున్నాను
గానీ
నీ
పిచ్చి
నీ
అంత
పిచ్చి
పట్టేలాగ
ఉంది నాకు
నిజ్జంగా
ప్రేయసీ నా హృదయ నివాసీ
అనలేకపోతున్నాను
గానీ
నీ
పిచ్చి
నీ
అంత
పిచ్చి
పట్టేలాగ
ఉంది నాకు
నిజ్జంగా
ప్రేయసీ నా హృదయ నివాసీ